శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 18, 2021 , 04:44:19

‘రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పించండి ’

‘రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పించండి ’

కృష్ణకాలనీ, జనవరి 17 : అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి జిల్లాలోని హిందువులు టోకెన్ల ద్వారా తోచినంత నిధి సమర్పించాలని విశ్వహిందూ పరిషత్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి మల్లారెడ్డి కోరారు. ఆదివారం సంతోషిమాత ఆలయంలో జిల్లా అధ్యక్షుడు బబ్బిడి దేవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందిరం నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతుండడంతో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 20 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో టోకెన్ల ద్వారా నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో రామాచారి, సదయ్య, చక్రపాణి, పునీత్‌, అల్లం సాగర్‌, వివేక్‌, శ్యామ్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo