Zelensky: చైనా శాంతి ప్రణాళిక.. జిన్‌పింగ్‌తో భేటీకి జెలెన్స్కీ ప్లాన్
Zelensky :చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ కావాలనుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. శాంతి ప్రణాళికలో భాగంగా జిన్‌పింగ్‌తో భేటీకానున్నట్లు చెప్పారు. రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాదైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) మాట్లాడారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ కావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శాంతి ప్రణాళికలో భాగంగా జిన్‌పింగ్(Xi Jinping)తో భేటీకానున్నట్లు చెప్పారు. రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా తన ఆయుధాలను రష్యాకు పంపవదన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చైనా శాంతి ప్రతిపాదన చేసినా.. ఉక్రెయిన్ నుంచి రష్యా దళాల ఉపసంహరింపుపై మాత్రం ఆ డాక్యుమెంట్లో ఎటువంటి అంశాన్ని వెల్లడించలేదు. జిన్‌పింగ్‌ను కలిసేందుకు జెలెన్స్కీ ఉత్సాహాంగా ఉన్నా.. చైనా అధికారులు మాత్రం ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు చైనా చేసిన శాంతి ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. చైనా అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు రష్యా విదేశాంగ శాఖ చెప్పింది.
చైనా పీస్ ప్లాన్‌ను పుతిన్ మెచ్చుకుంటున్నారని, అప్పుడు దాన్ని ఎలా అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ఆ శాంతి ప్రణాళిక ఒక్క రష్యాకు తప్ప ఎవరికీ ఉపయోగపడదని ఆయన ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Peace Plan
- Russia
- Ukraine War
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

