Zealandia | ఎనిమిదో ఖండం జిలాండియా.. కొత్త ఖండాన్ని కనుగొన్న పరిశోధకులు
భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే.. ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు. అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది.
ఆక్లాండ్, సెప్టెంబర్ 27: భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే.. ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు. అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది. సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీఎన్ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉంది.
గోండ్వానా నుంచి వేరుపడి…
అతి ప్రాచీన ఖండం గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్కు ఆరు రెట్లు ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతం చిన్నచిన్న దీవులతో న్యూజిలాండ్ మాదిరిగా ఉంది.

రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు…
డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. 375 ఏండ్ల తర్వాత జీఎన్ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. అక్కడ లభ్యమైన రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఖండం గోండ్వానా నుంచి ఎందుకు వేరుపడిందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు.

జిలాండియా విశేషాలు…
ఖండం పేరు: జీలాండియా
విస్తీర్ణం: 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు (మడగాస్కర్కు ఆరు రెట్లు)
ఎక్కడ ఉంది: పసిఫిక్ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో
- మొత్తం విస్తీర్ణంలో 94% నీటిలోనే ఉంది.

Zelandia 2
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

