ఈనెల 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా
World Population | ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే మూడు రెట్లు అధికమని తెలిపింది. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది. కాగా, మరో ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని పేర్కొన్నది. 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని వెల్లడించింది.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022 పేరుతో ఈ ఏడాది జులై 11న ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. నవంబర్ 15 నాటికి ప్రపంచ మొత్తం జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని అందులో తెలిపింది. 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నది.

ఇక ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. 2050 నాటికి ఈ సంఖ్య 9.7 బిలియన్లకు, 2080లో 10.4 బిలియన్లు, 2100 నాటికి11.2 బిలియన్లు దాటుతుందని అంచనా వేసింది. కాగా, వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికిపైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే ఈ అధిక జనాభా రేటు ఉంటుందని చెప్పింది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

