80 కోట్ల ఉద్యోగాల కొరత.. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి హెచ్చరిక
దీర్ఘ కాలంలో ప్రపంచాన్ని 80 కోట్ల ఉద్యోగాల కొరత వేధించనున్నదని.. విధాన కర్తలు ఈ విషయాన్ని విస్మరించొద్దని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...
వాషింగ్టన్ : దీర్ఘ కాలంలో ప్రపంచాన్ని 80 కోట్ల ఉద్యోగాల కొరత వేధించనున్నదని.. విధాన కర్తలు ఈ విషయాన్ని విస్మరించొద్దని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… రానున్న 10-15 ఏండ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 120 కోట్ల మంది ప్రజలు శ్రామిక శక్తిలో భాగస్వాములు అవుతారని.. కానీ పరిస్థితి చూస్తే కేవలం 40 కోట్ల ఉద్యోగాలు మాత్రమే కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
దీని వల్ల 80 కోట్ల ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఇది ఆర్థిక-సామాజిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక, భూ చట్టాలు, వాణిజ్య వ్యవస్థలు, లాజిస్టిక్స్‌లలో పురోగతి సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తగినంత ఉపాధి కల్పన లేకపోతే అక్రమ వలసలు, అస్థిరత పెరుగుతాయని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

