వాషింగ్టన్: బాయ్‌ఫ్రెండ్ చీటింగ్‌ను సహించలేని ప్రియురాలు అతడ్ని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ స్మిత్ తనను చీటింగ్ చేస్తున్నట్లు 26 ఏళ్ల గేలిన్ మోరిస్ అనుమానించింది. ఆపిల్ ఫోన్లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేయసాగింది. ఒక బార్ వద్ద స్మిత్ ఉన్నట్లు పసిగట్టి అక్కడకు వెళ్లింది. అతడి వెంట ఒక అమ్మాయి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీ వైన్ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు.
కాగా, బార్ బయట స్మిత్‌పై మోరిస్ దాడి చేసింది. అతడ్ని పలుమార్లు కొట్టింది. చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. ఆ తర్వాత కారును ఆపిన మోరిస్, ఫుడ్ ఆర్డర్ కోసం ఆ రెస్టారెంట్ వద్ద వేయిట్ చేస్తున్న ఆ అమ్మాయిపై దాడి చేయబోయింది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన స్మిత్ అప్పటికే చనిపోయినట్లు గ్రహించారు. మృతుడి ప్రియురాలైన మోరిస్‌ను అరెస్ట్ చేశారు.