Viral News | బయటపడిన వందేండ్ల నాటి డైరీ మిల్క్ ర్యాపర్
ఓ మహిళ తన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా వందేండ్ల నాటి డైరీ మిల్క్ ర్యాపర్‌ను (Viral News) కనుగొన్నారు. జెయింట్ ర్యాపర్‌ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు.
న్యూఢిల్లీ : ఓ మహిళ తన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా వందేండ్ల నాటి డైరీ మిల్క్ ర్యాపర్‌ను (Viral News) కనుగొన్నారు. జెయింట్ ర్యాపర్‌ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఎమ్మా యంగ్ అనే మహిళ తన బాత్రూం రినోవేషన్ చేస్తుండగా పర్పుల్ కలర్లో ఉన్న డైరీ మిల్క్ ర్యాపర్‌ను గుర్తించారు. కంపెనీ ప్రతినిధులను ఎమ్మా సంప్రదించగా ఇది 1930-34 నాటిదని వారు తెలిపారు.
చాక్లెట్ బార్ ధర కేవలం 6 పెన్స్ ఉన్న సమయంలో దీన్ని తయారుచేశారని వెల్లడైంది. ఈ ర్యాపర్‌పై గోల్డ్ కలర్లో క్యాడ్బరీస్ డైరీ మిల్క్ చాక్లెట్ నియాపోలిటన్ అని రాసిఉంది. ఎమ్మా ఇల్లును 1932లో నిర్మించగా 2016లో ఈ ఇంటిలోకి ఆమె మారారు.
వందేండ్లయినా చాక్లెట్ బార్ అదే కండిషన్లో ఉంది. అది చెక్కుచెదరని కండిషన్లో ఉండటం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని 51 ఏండ్ల ఎమ్మా చెప్పుకొచ్చారు. చాక్లెట్ ఓవైపు ఎలుక కొరికినట్టుగా ఉందని మిగిలిన భాగం షెల్ఫ్‌లో పెట్టినట్టుగా ఉందని అన్నారు. ఈ చాక్లెట్‌పై గార్డెన్ విలేజ్ ఆఫ్ బోర్న్‌విల్లే ఇంగ్లండ్‌లో తయారుచేయబడిందని రాసి ఉంది.
ఈ క్యాడ్బరీస్ పీస్ చరిత్రను తిరిగి జ్ఞప్తికి తీసుకువచ్చిందని క్యాడ్బరీ ప్రతినిధి పేర్కొన్నారు. బ్రిటిష్ సంస్కృతిలో క్యాడ్‌బరీకి 200 ఏండ్ల ఘన వారసత్వం ఉందని ప్రజల జీవితాల్లో తమ చాక్లెట్ చెరగని ముద్ర వేసిందని 1930ల నాటి డైరీ మిల్క్ నియోపాలిటన్స్ చాక్లెట్ గుర్తు చేసిందని అన్నారు.
Read More :
Viral video | ప్రేక్షకుల హృదయాలు గెలిచిన మహ్మద్ సిరాజ్.. ఆటతో కాదు, మరెలాగో తెలుసా..?
Viral News | వింత సంప్రదాయం.. బురదలో గేదెల్లా పొర్లుతూ వరుడికి ఆహ్వానం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- cadbury
- Chocolate
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

