చైనా కట్టడికి మరో కూటమి

- యూఎస్, ఆస్ట్రేలియా, బ్రిటన్
- దేశాలు ‘ఆకస్’ పేరుతో జట్టు
- క్వాడ్‌కు అదనంగా కొత్త కూటమి
- ఇండో పసిఫిక్‌లో స్థిరత్వానికే
- మూడు దేశాల ఉమ్మడి ప్రకటన
వాషింగ్టన్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు క్వాడ్‌కు అదనంగా మరో కూటమి ఏర్పాటైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు కలిసి ‘ఆకస్(ఏయూకేయూఎస్)’ పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్లు సాయం చేయనున్నాయి. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో కొత్తగా ఎదురవుతున్న ముప్పులను ఎదుర్కొని, స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. అయితే ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. వర్చువల్ విధానంలో ఈ కూటమిని ప్రారంభించారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం అవశ్యం. ఈ ఉమ్మడి లక్ష్యం విషయంలో మా మూడు దేశాలు ఇప్పటికే సహకరించుకొంటున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే కూటమిగా ఏర్పడ్డాం. ఇది చరిత్రాత్మక నిర్ణయం’ అని బైడెన్ అన్నారు. ఆకస్ కార్యాచరణను 18 నెలల్లో రూపొందించనున్నారు. ఇండో పసిఫిక్‌లో చైనాకు చెక్ పెట్టేందుకే గతంలో క్వాడ్ భద్రతా కూటమి ఏర్పడింది. ఇందులో భారత్ కూడా భాగస్వామి. క్వాడ్ సమావేశం ఈ నెల 24న జరుగనున్నది. సమావేశానికి వారం రోజుల ముందు అదే లక్ష్యంతో కొత్త కూటమిని ప్రకటించడం విశేషం.
ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు: చైనా
కొత్త కూటమి ఆకస్‌ను చైనా ఖండించింది. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విమర్శించింది. ‘ఆస్ట్రేలియా అణ్వాయుధ దేశం కాదు. ఇప్పుడు అణు జలాంతర్గామి తయారు చేయడానికి సిద్ధపడుతున్నది. ఇది అణు నిరాయుధీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది’ అని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతాయని పేర్కొన్నది. ఇండో పసిఫిక్‌లో చైనా దీవులు నిర్మించి మిలిటరీ బేస్‌లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

