ప్రతి పైసా రష్యా చెల్లిస్తుంది.. ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తా : జెలెన్స్కీ
రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన నష్టానికి రష్యా ప్రతి పైసా చెల్లిస్తుందని ప్రకటించారు. రెండు ప్రపంచ యుద్ధాలు, మూడు కరువులు, చెర్నోబిల్ పేలుడు, క్రిమియా ఆక్రమణ.. ఇలా వీటన్నింటి నుంచీ బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా ధ్వంసం చేయాలని రష్యా అనేక మార్లు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కానీ.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్నారు. ఇంత జరిగిన తర్వాత తాము భయపడుతూ.. రష్యాకు లొంగిపోతామని ఎవరైనా అనుకుంటే అది నిజం కాదని, ఉక్రెయిన్ ప్రజల గురించి వారికి ఏమీ తెలియదన్నట్లేనని వ్యాఖ్యానించారు. అసలు ఉక్రెయిన్ గురించి పుతిన్‌కు ఏమీ తెలియదని జెలెన్స్కీ ఎద్దేవా చేశారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. రాజధాని కైవ్, ఖార్కివ్ నగరాల్లో రష్యన్ సైన్యం విధ్వంసం సృష్టించింది. నివాస ప్రాంతాలతో పాటు ఆసుపత్రుల వద్ద పేలుళ్లు జరిగాయి. సైనిక చర్యలు ప్రారంభమై ఎనిమిది రోజులు కావొస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా ఇప్పుడు ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నది. ఇందులో భాగంగా చెర్నిహివ్ ఆయిల్ డిపోపై రష్యా మిస్సైల్స్‌తో దాడి చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

