Pakistani MP | భారత్‌తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతా.. పాక్ ఎంపీ వీడియో వైరల్
Pakistani MP | పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేస్తుందన్న భయం ఆ దేశ ప్రజలతోపాటు పాక్ నేతలను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్‌కు పారిపోతానని పాక్ ఎంపీ అన్నారు.
ఇస్లామాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేస్తుందన్న భయం ఆ దేశ ప్రజలతోపాటు పాక్ నేతలను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్‌కు పారిపోతానని పాక్ ఎంపీ అన్నారు. (Pakistani MP) పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాట్ మీడియాతో మాట్లాడారు. భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీ చేతపట్టి సరిహద్దుకు వెళ్తారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘భారతదేశంతో యుద్ధం జరిగితే నేను ఇంగ్లాండ్‌కు వెళ్తా’ అని అన్నారు.
కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తగ్గవచ్చని మీరు నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు మార్వత్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘నేను చెప్పగానే వెనక్కి తగ్గడానికి మోదీ నా అత్త కొడుకునా?’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాట్. అయితే గతంలో ఆ పార్టీతో పాటు నాయకత్వంపై పదే పదే ఆయన విమర్శలు చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక పదవుల నుంచి ఆయనను తొలగించారు.
Pakistaniyon ki fat ke char ho gayi hai🧵
Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiye
Sher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂
Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1
— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- England
- go to
- India
- Pakistani MP
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

