Bolsonaro: నన్ను చంపొచ్చు, జైల్లో వేయొచ్చు లేదా తిరిగి ఎన్నుకోవచ్చు!
తన భవిష్యత్తు గురించి మూడు ముక్కల్లో చెప్పారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో( Bolsonaro ). తనను జైల్లో వేయొచ్చు, చంపొచ్చు లేదా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించవచ్చు అని ఆయ అన్నారు. ఎన్నికల్లో బోల్సోనారో మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా కంటే వెనుకబడి ఉన్నారు.

రియో డిజనీరో: తన భవిష్యత్తు గురించి మూడు ముక్కల్లో చెప్పారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో( Bolsonaro ). తనను జైల్లో వేయొచ్చు, చంపొచ్చు లేదా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించవచ్చు అని ఆయ అన్నారు. ఎన్నికల్లో బోల్సోనారో మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా కంటే వెనుకబడి ఉన్నారు. అయితే జైలు అవకాశం మాత్రం లేదు అని ఆయనే అన్నారు. భూమిపై ఉన్న ఏ వ్యక్తీ నన్ను బెదిరించలేరు అని బోల్సోనారో అనడం గమనార్హం. 2018లో ఎన్నికల ప్రచారంలో బోల్సోనారోపై హత్యా ప్రయత్నం జరిగింది. దేశ న్యాయవ్యవస్థ, ఎన్నికల అధికారులతో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోల్సోనారో ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తానన్న విశ్వాసంతో ఆయన ఉన్నారు. అయితే బ్రెజిల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, ఈ ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించబోననీ బోల్సోనారో చెప్పడం విశేషం. తనకు మద్దతుగా సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా జరపబోయే ఆందోళనలో పాల్గొనాలని తన పార్టీ నేతలను ఆయన కోరారు.
కోవిడ్‌ను నియంత్రించడంలో బొల్సొనారో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పాపులారిటీ తగ్గిపోయింది. బ్రెజిల్లో ఇప్పటి వరకు కరోనా వల్ల సుమారు 5 లక్షల మంది మరణించారు. రెండేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బొల్సొనారో .. కొవిడ్ వేళ క్వారెంటైన్ ఆంక్షలను వ్యతిరేకించారు. కొవిడ్ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

