Julian Assange: బ్రిటన్ జైలు నుంచి జూలియన్ అసాంజే విడుదల.. అమెరికా కోర్టులో హాజరుకానున్న వికీలీక్స్ ఫౌండర్
Julian Assange: అమెరికాతో డీల్ కుదుర్చుకున్న జూలియన్ అసాంజే.. బ్రిటన్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ప్రత్యేక విమానంలో ఆయన అమెరికా బయలుదేరి వెళ్లాడు. మారియానా కోర్టులో ఆయన హాజరుకానున్నాడు. ఆ తర్వాత స్వదేశం ఆస్ట్రేలియాలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.
బ్రిటన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే(Julian Assange).. బ్రిటన్ జైలు నుంచి విముక్తి అయ్యారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న అతను.. ప్రత్యేక విమానంలో బ్రిటన్ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికా రక్షణ సమాచారాన్ని బయటపెట్టిన కేసులో అమెరికా కోర్టులో ఆయన విచారణ ఎదుర్కొనున్నారు. గడిచిన అయిదేళ్ల నుంచి అతను బ్రిటీష్ జైలులోనే ఉన్నాడు. అమెరికాలోని నార్తర్న్ మారియానా దీవుల్లో ఉన్న కోర్టులో ఆయన విచారణను ఎదుర్కొంటారు. అయితే ఎక్కువ కాలం అసాంజే అమెరికా కస్టడీలో ఉండరన్న సమాచారం ఉన్నది.
బ్రిటన్ జైలులో ఉన్న కారణంగా.. అసాంజేకు అమెరికా కోర్టులో శిక్షపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అసాంజే తన స్వదేశం ఆస్ట్రేలియా వెళ్తారని అమెరికా న్యాయశాఖ తెలిపింది. వాస్తవానికి అమెరికా కోర్టులో సుమారు 62 నెలల శిక్షపడే అవకాశం ఉన్నది. కానీ బ్రిటన్ జైలులో ఎక్కువ కాలం గడిపినందు వల్ల అమెరికా కోర్టు ఆ శిక్షా కాలాన్ని తగ్గించే అవకాశం ఉన్నది.
బ్రిటన్‌లోని స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్టు నుంచి అసాంజే విమానం ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2019 నుంచి బెల్మార్ష్ ప్రిజన్లో అతను ఉన్నాడు. అతను మొత్తం 1901 రోజుల పాటు జైలులో గడిపాడు. అమెరికాకు తనను అప్పగించాలని అతను కోర్టు నుంచే పోరాటం చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

