Turkey planes | మూడు రోజులుగా పాకిస్థాన్‌కు టర్కీ సైనిక విమానాలు.. ఆయుధాలు తరలిస్తున్నారా..?
Turkey planes | పాకిస్థాన్, టర్కీ (Pakistan, Turkey) ల మధ్య మూడు రోజులు కొనసాగిన సైనిక కదలికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన పలు C-130 హెర్క్యులస్ (C-130 Herculus) సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్‌లో పదేపదే ల్యాండ్ అయ్యాయి.
Turkey planes : పాకిస్థాన్, టర్కీ (Pakistan, Turkey) ల మధ్య మూడు రోజులు కొనసాగిన సైనిక కదలికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన పలు C-130 హెర్క్యులస్ (C-130 Herculus) సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్‌లో పదేపదే ల్యాండ్ అయ్యాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య ఈ విమానాలు రావల్పిండి (Rawalpindi) సమీపంలోని నూర్ ఖాన్, కరాచీలోని మస్రూర్ వైమానిక స్థావరాలకు పలుమార్లు వచ్చి వెళ్లినట్టు తెలిసింది. ఇంత తక్కువ సమయంలో, ఇంత తరచుగా సైనిక విమానాలు రాకపోకలు సాగించడం అసాధారణమని నిపుణులు అంటున్నారు.
నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ప్రకారం.. ఈ విమానాల ద్వారా పాకిస్థాన్‌కు భారీ స్థాయిలో డ్రోన్లు, వాటికి సంబంధించిన వ్యవస్థలను టర్కీ సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రోన్లతోపాటు హెచ్‌క్యూ-సిరీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా తరలించి ఉండే అవకాశాలున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో TUAF 526 కాల్‌సైన్‌తో గుర్తించిన టర్కీకి చెందిన మరో A400M సైనిక విమానం మురిద్ స్థావరంలో కనిపించినట్లు తెలిసింది.
ఆసక్తికరంగా టర్కీ విమానాలు కార్యకలాపాలు సాగించిన అదే సమయంలో, అవే వైమానిక స్థావరాల్లో చైనా సైనిక రవాణా విమానాలు కూడా సంచరించినట్లు భద్రతావర్గాలు గుర్తించాయి. టర్కీ, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారంలో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో టర్కీ నుంచి పాకిస్థాన్ ‘బైరక్టార్’ డ్రోన్లను కొనుగోలు చేసింది. ఇటీవల ఆగస్టు 7న పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ కూడా కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా, మిగతా రెండు దేశాలపై జరిగినట్టుగా భావిస్తారు. అయితే ఈ విమానాల్లో ఏముందనే దానిపై టర్కీగానీ, పాకిస్థాన్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం విమానాల కదలికలు, నిఘా వర్గాల అంచనాల ఆధారంగానే ఈ నివేదికలు వెలువడుతున్నాయి. వ్యూహాత్మక సమీకరణాలు మారుతున్న తరుణంలో ఈ పరిణామాలు ఈ ప్రాంతంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

