న్యూయార్క్ : లోహాలతో నిండిన ఓ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 12 సైక్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
భూమి నుంచి 2.2 బిలియన్ మైళ్ల దూరంలోని 16 సైక్ అనే ఉల్కపై పరిశోధనలు చేసి విశ్వంలో లోహాలు, ఇతర ఖనిజాల పుట్టుక గురించి తెలుసుకునేందుకు నాసా ఈ ప్రయోగం చేపడుతున్నది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నాసాకు సహకారం అందిస్తున్నది.