ఉక్రెయిన్‌లో హెల్త్‌కేర్ పెసిలిటీస్ దాడులు.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
WHO |
జనీవా: ఉక్రెయిన్‌లో హాస్పిటళ్లు, హెల్త్‌కేర్ సెంటర్లు, నర్సింగ్ హోమ్ వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై రష్యా దాడులు చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు హెల్త్‌కేర్ ఫెసిలిటీస్‌పై 43 సార్లు దాడులు జరిగాయని దీంతో 12 మంది మృతిచెందారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. మరో 35 మంది గాయపడ్డారని వెల్లడించారు.
హెల్త్‌కేర్‌పై దాడి చేయడమంటే అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. అవి ప్రజలకు అత్యవసరంగా అవసరమైన సంరక్షణను అందకుండా చేస్తాయని, అప్పటికే దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తాయన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మనం అదే చూస్తున్నామని చెప్పారు.
ఉక్రెయిన్‌లో 35 వేలకుపైగా కేంద్రాల్లో మానసిక పరమైన రుగ్మతలో బాధపడుతున్న వారు చికిత్స పొందుతున్నారని, రష్యా దాడుల వల్ల అవి మందులు, ఆహారం, దుప్పట్లు వంటి అత్యవసరాల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ యుద్ధం ఉక్రెయిన్‌లో కరోనా వ్యాప్తికి కూడా దోహదం చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల కరోనా పరీక్షలు పూర్తిగా తగ్గిపోయాయని, దీంతో మహమ్మారి వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. దేశంలో కేవలం 40 మంది జనాభాకే పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నారని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

