న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ తాత్కాలిక సీఈవోగా మిరా మురాఠీ(Mira Murati) నియమితులయ్యారు. సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించి ఆ స్థానంలో మిరాఠీకి బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ మిరా మురాఠీ ఎవరో తెలుసుకుందాం. ఆమె వయసు 34 ఏళ్లు. ఓపెన్ ఏఐలో మాజీ సీటీవోగా చేశారు. కంపెనీలో బ్రిలియంట్ మైండ్ అని ఆమెకు గుర్తింపు ఉన్నది. చాట్‌జీపీటీ, డాల్-ఈ లాంటి టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
మిరా మురాఠీ అల్బేనియాలో జన్మించారు. ఆమె పేరెంట్స్ స్థానికులే. 16 ఏళ్ల వయసులో ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. అక్కడ పియర్సన్ కాలేజీలో ఆమె చదువుకున్నది. అమెరికాలోని డార్త్మౌత్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసింది. అండర్గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో.. ప్రాజెక్టులో భాగంగా హైబ్రిడ్ రేస్ కారును తయారు చేసింది.
గోల్డ్‌మన్ సాచ్స్, జోడియాక్ ఏరోస్పేస్లో ఆమె ఇంటర్న్‌షిప్ చేసింది. టెస్లా కంపెనీలో మోడల్ ఎక్స్‌పై ఆమె మూడేళ్లు పనిచేసింది. స్టార్టప్ లీప్ మోషన్లో 2016లో ఆమె జాయిన్ అయ్యింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేసింది. లీప్ మోషన్ కంపెనీ నుంచి ఆమె నేరుగా ఓపెన్ఏఐలో వీపీగా చేరింది. ఏఐ, పార్ట్నర్షిప్స్ కోసం ఆమె వీపీగా చేశారు.
టెస్లా, లీప్ మోషన్ కంపెనీల్లో చేస్తున్న సమయంలో ఏఐ అప్లికేషన్స్‌పై ఆమె పనిచేసింది. ఏజీఐ అనేది కీలకమైన టెక్నాలజీగా మారనున్నదని, ఆ టెక్నాలజీ నిర్మాణ సమయంలో పాలుపంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు మురాఠీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఓపెన్ఏఐలో 2018లో మిరా జాయిన్ అయ్యింది. అప్పుడు ఆమె సూపర్కంప్యూటింగ్పై పనిచేసింది. 2022లో ఆమెకు చీప్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చింది.