ఇలా చేస్తే ఈ ఏడాది మహమ్మారి నుంచి బయటపడతాం : డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి 2022లో సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు తొలగిస్తే మనం ఈ మహమ్మారిని అంతం చేయవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధనామ్ గెబ్రియసస్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతుంటే కొన్ని దేశాలు వ్యాక్సిన్ నిల్వలను పెంచుకుని కూర్చున్నాయని మండిపడ్డారు. సంకుచిత జాతీయవాదం, కొన్ని దేశాలు సమాన పంపిణీని పక్కనపెట్టి వ్యాక్సిన్ల నిల్వలను పెంచుకోవడం ఒమిక్రాన్ వ్యాప్తికి దారితీసిందని ఆరోపించారు. అసమానతలు దీర్ఘకాలం కొనసాగితే వైరస్ మనం నివారించలేదని నియంత్రించలేని స్ధాయికి చేరుతుందని ఆయన హెచ్చరించారు.
గత రెండేండ్లుగా మహమ్మారి మనల్ని వెంటాడుతున్న క్రమంలో ప్రపంచం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోందని మనమంతా ఐక్యంగా పోరాడితే ఈ ఏడాది మహమ్మారిని అంతమొందించగలమనే విశ్వాసం తనకుందని అన్నారు. ఒమిక్రాన్, డెల్టా కేసుల సునామీ ప్రపంచాన్ని ముంచెత్తడం పట్ల కలత చెందుతున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి టీకాలు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

