Military Strengths: ఇరాన్, ఇజ్రాయిల్ మిలిటరీ బలమెంత?
Military Strengths: సిరియాలో జరిగిన దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ సైనిక శక్తి ఎంతో తెలుసుకుందాం. భౌగోళికంగా ఇజ్రాయిల్ కన్నా ఇరాన్ చాలా పెద్దది. ఇరాన్ జనాభా సుమారు 9 కోట్లు ఉంటుంది.
న్యూఢిల్లీ: సిరియాలో జరిగిన దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ సైనిక(Military Strengths) శక్తి ఎంతో తెలుసుకుందాం. భౌగోళికంగా ఇజ్రాయిల్ కన్నా ఇరాన్ చాలా పెద్దది. ఇరాన్ జనాభా సుమారు 9 కోట్లు ఉంటుంది. ఇజ్రాయిల్ కన్నా పది రెట్లు ఎక్కువ. కానీ ఇది ఆ దేశాన్ని సైనిక శక్తి విషయంలో బలంగా చూపించలేకపోతున్నది.
మిస్సైళ్లు, డ్రోన్లపైనే ఎక్కువ ఇరాన్ తన పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం వద్ద ఆయుధాలు చాలా ఉన్నాయి. ప్రాక్సీ వార్ కొనసాగిస్తున్న వారికి ఆయుధాలను సరఫరా చేస్తున్నది. యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లాలకు ఇరాన్ నుంచి ఆ ఆయుధాలు వెళ్తున్నాయి.
అయితే ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు ఫైటర్ జెట్స్ విషయంలో ఇరాన్ వెనుకబడి ఉన్నది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొనసాగించేందుకు ఇరాన్‌కు రష్యా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్షంగా ఇరాన్ సహకరిస్తున్నది. ఆ దేశం తయారు చేసిన షాహిద్ డ్రోన్లను రష్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రష్యానే ఆ డ్రోన్లను ఉత్పతి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచంలోనే అత్యాధునిక వైమానిక రక్షణ క్షేత్రం ఇజ్రాయిల్ వద్ద ఉన్నది. ఐఐఎస్ఎస్ మిలిటరీ లెక్కల ప్రకారం.. ఇజ్రాయిల్ వద్ద 14 స్వ్కాడ్రన్ల విమానాలు ఉన్నాయి. దాంట్లో ఎఫ్15, ఎఫ్16, ఎఫ్-35 జెట్ విమానాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థి లొకేషన్లోకి చొచ్చుకువచ్చి కచ్చితత్వంతో దాడులు చేయడం ఇజ్రాయిల్‌కు వెన్నతో పెట్టిన విద్య అని తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

