జెనీవా: డెల్టా వేరియంట్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థార్డ్ వేవ్ తొలి దశలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ హెచ్చరించారు. జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మనం కరోనా థార్డ్ వేవ్ ఆరంభ దశలో ఉన్నామన్నారు. కరోనా వైరస్ నిరంతరం మారుతోందని, మరింత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైరస్ 111 దేశాల్లో నమోదు అయ్యింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు.