Israel-Iran | జెరూసలెం: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గాజాలో తమ భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరోచోట కూడా చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తప్పదంటూ సంకేతాలు వెలువడ్డాయి.
ఏప్రిల్ 1న సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వాయు సేన దాడిలో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది.