Yevgeny Prigozhin | రష్యాను వీడి బెలారస్కు తిరుగుబాటు నేత ప్రిగోజిన్
Yevgeny Prigozhin | రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కిరాయి సేన అయిన ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ రోస్తోవ్ నగరాన్ని విడిచి బెలారస్కు వెళ్లిపోయాడు. ఆయన రోస్తోవ్ను వదిలి బెలారస్కు వెళ్ళిపోతున్న చిత్రాలను రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసింది.
మాస్కో: రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కిరాయి సేన అయిన ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ రోస్తోవ్ నగరాన్ని విడిచి బెలారస్కు వెళ్లిపోయాడు. ఆయన రోస్తోవ్ను వదిలి బెలారస్కు వెళ్ళిపోతున్న చిత్రాలను రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసింది. రష్యా సైన్యంపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత బెలారస్కు పలాయనం చిత్తగించడం కేవలం 24 గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి.
ఒక రోజు క్రితం ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ రోస్తోవ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ సేనలపై దాడులు చేసినందుకు ప్రతిగా తాము రష్యా సైన్యంపై బదులు తీర్చుకుంటామని ప్రిగోజిన్ హెచ్చరించారు. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే ఆయన బెలారస్కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
యెవ్గెనీ ప్రిగోజిన్ రోస్తోవ్ నగరంలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి వాహనంలో వెళ్లిపోతున్నారని రాయిటర్స్ తెలిపింది. ప్రిగోజిన్ రష్యా నుంచి బెలారస్కు వెళ్ళిపోతున్నారని, రక్తపాతాన్ని నివారించడానికి ఆయనతో పాటు వాగ్నర్ దళాల మీద ఉన్న అభియోగాలన్నింటినీ అధికారులు ఉపసంహరించుకున్నారని రష్యా ప్రభుత్వ మీడియా కూడా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Belarus
- Puthin
- Russia
- Wagner group
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

