Vladimir Putin: ఆ దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తాం: పుతిన్ వార్నింగ్
Vladimir Putin: పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేస్తున్న దేశాలను ఉద్దేశించి ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తే, ఆ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న దేశాలకు తాము ఆయుధాలు ఇవ్వబోనున్నట్లు చెప్పారు.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న అమెరికాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై దాడికి ఆయుధాలు ఇవ్వడం వల్ల సమస్యలు తీవ్రతరం అవుతాయన్నారు. వార్ జోన్‌కు ఆయుధాలు పంపడం వీలవుతుందని అనుకునప్పుడు.. అలాగే తాము కూడా సున్నితమైన దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తామని పుతిన్ అన్నారు. పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తే, ఆ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న ఇతర దేశాలకు తాము కూడా ఆయుధాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే ఏ దేశాలకు ఆయుధాలను ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. జర్మనీ తయారు చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతోందని, రష్యాపై దాడికి మిస్సైళ్లు పంపడం వల్ల, రష్యా-జర్మనీ మధ్య సంబంధాలను బలహీనపరుస్తుందని పుతిన్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

