Drunk Driving | డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వీసా రద్దు.. నిబంధనలు మరింత కఠినతరం
ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్న వారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వెంటనే వారి వీసా రద్దు చేస్తున్నారు. తాజాగా మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి వీసాను అధికారులు ఇదే కారణంగా రద్దు చేశారు. ఎఫ్-1 వీసాపై మినియాపొలిస్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆ విద్యార్థిని ఇమిగ్రేషన్ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు.
Drunk Driving | న్యూఢిల్లీ : ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్న వారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వెంటనే వారి వీసా రద్దు చేస్తున్నారు. తాజాగా మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి వీసాను అధికారులు ఇదే కారణంగా రద్దు చేశారు. ఎఫ్-1 వీసాపై మినియాపొలిస్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆ విద్యార్థిని ఇమిగ్రేషన్ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించిన వారిని సైతం అధికారులు వీసా రద్దుచేసి వారి స్వదేశాలకు పంపించారు. ఇది కూడా అలాంటి అరెస్టేనని భావించిన ఇతర విద్యార్థులు నిరసన ప్రదర్శనలకు దిగారు.
అయితే ఇది రాజకీయ సంబంధమైనది కాదని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు వీసాను రద్దు చేశామని అమెరికా హోంశాఖ వివరణ ఇచ్చింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో దోషిగా నిర్ధారణ కాకపోయినా, కేవలం అరెస్టయినా సరే వీసా రద్దయ్యే అవకాశం ఉంటుందని, కాబట్టి విద్యార్థులు, వర్క్ వీసాపై వచ్చినవారు జాగ్రత్తగా ఉండాలని న్యాయ నిపుణుడు కేతన్ ముఖీజా సూచించారు. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో ఒకటి కన్నా ఎక్కువ సార్లు దొరికితే శాశ్వత పౌరసత్వం లభించిన వారి వీసాలు సైతం రద్దయ్యే అవకాశం ఉన్నదని మరో ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్‌శర్మ చెప్పారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్న సుమారు 300 మంది వీసాలు ఇటీవలి కాలంలో రద్దయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
విద్యార్థులపై ఏఐతో నిఘా
హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చే విదేశీ విద్యార్థులను గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధ ను (ఏఐ) ఉపయోగిస్తున్నది. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను ఏఐ సాయంతో తనిఖీ చేస్తున్నది. పాలస్తీనా అనుకూల ఉద్యమాలు, యూదు వ్యతిరేక కార్యకలాపాలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేపడుతున్న కఠిన చర్యల్లో భాగంగా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎఫ్1, ఎం1, జే1 వీసాలను రద్దు చేసినట్లు వందలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ-మెయిళ్లను పంపించింది. స్వయంగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. మూడు వారాల్లో 300 మంది విద్యార్థుల వీసాలను ఈ విధంగా రద్దు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

