బెర్లిన్: జర్మనీలోని ఓ గురుద్వార(Germany Gurdwara)లో సిక్కులు ఘర్షణ పడ్డారు. మోయర్స్ పట్టణంలోని దుస్బర్గ్ ప్రాంతంలో ఉన్న గురుద్వారలో ఈ ఘటన జరిగింది. ఘర్షణల్లో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గన్నులు, కత్తులు, పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గురుద్వారలో చోటుచేసుకున్న ఘర్షణ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరిగింది. ఆ దాడిలో కత్తులు, కిర్పన్లు, గన్ వాడినట్లు తెలుస్తోంది.
సుమారు 40 మంది ఆ ఘర్షణల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఏ కారణం చేత ఘర్షణ జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గురుద్వారకు ఇటీవల కొత్త బోర్డు ఎన్నికైంది. అయితే ఆ సమావేశంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. గురుద్వార నిధుల గురించి రెండు వర్గాలు కొట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. హుండీ డబ్బు అంశంలో వివాదం చెలరేగినట్లు భావిస్తున్నారు.
గురుద్వారలో ఘర్షణ జరగడంతో అనేక మంది భక్తులు అక్కడ నుంచి పరారీ అయ్యారు. ఈ కొట్లాటలో మొత్తం 11 మంది గాయపడినట్లు బిల్డ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. గాయపడ్డవారిని పారామెడిక్స్ చికిత్స అందించారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. ఎవరిపై ఎవరు అటాక్ చేశారన్న కోణంలో ప్రస్తుతం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
🤯🇩🇪 Shocking scenes from Gurdwara Duisburg, Germany:
Sikhs fighting inside sacred space, turbans flying, kirpans drawn on each other over Golak money, and a forced takeover by the previous management, who lost the election.
This violence isn’t random. It’s the direct result of… pic.twitter.com/47h4lni6w1
— Allen Hampton (@Hamp_Allen) April 20, 2026