Dublin | చిన్నారులపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో తీవ్ర ఉద్రిక్తత
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు.
డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు. దీంతో వందలాది మంది డబ్లిన్ వీధుల్లో నిరసనకు (Protests) దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అల్లర్లు (Riots) చెలరేగాయి. ఆందోళనకారులు పలు వాహనాలను దగ్ధం చేయడంతోపాటు దుకాణాలను లూటీ చేశారు.
గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం) నగరంలోని పార్ణెల్ స్క్వేయర్లోని (Parnell Square) ప్రాథమిక పాఠశాల (Primary School) వద్ద ఓ దుండగుడు ఐదుగురిపై కత్తితో దాడికిపాల్పడ్డాడు. వారిలో ఐదేండ్ల చిన్నారి సహా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే దాడికి పాల్పడింది విదేశీయుడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దాడికి నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్లు, బస్సులకు నిప్పుపెట్టారు. పలు దుకాణాలను కొల్లగొట్టారు. వలసదారులు ఉన్న ప్రాంతాల్లో ఐర్లాండ్ జెండాలు పట్టుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.




Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

