Venezuela | విమానంలో పొగలు.. అత్యవసర స్లైడ్ ద్వారా బయటపడుతూ గాయాలపాలైన ప్రయాణికులు
Venezuela | లేజర్ ఎయిర్‌లైన్స్ (Laser Airlines) ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది.
Venezuela | లేజర్ ఎయిర్‌లైన్స్ (Laser Airlines) ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడే క్రమంలో గాయపడ్డారు (passengers injured).
ది ఏవియేషన్ హెరాల్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. లేజర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా (Venezuela) నుంచి డొమినికన్ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, విమానంలో పొగలు (Smoke in flight) గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా అనౌన్స్ చేశారు.
సిబ్బంది అనౌన్స్‌మెంట్‌తో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. కొందరు కిందకు జారి అదే వేగంతో పైకిలేచి కిందపడిపోయారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే, విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటన తర్వాత దాదాపు మూడు గంటల ఆలస్యంగా విమానం శాంటో డొమింగోకు బయలుదేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. రెండు రోజుల్లో రెండో ఘటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

