Worlds Oldest Man | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి మృతి
Worlds Oldest Man | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి (Worlds Oldest Man)గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా (Juan Vicente Perez Mora) తాజాగా మరణించారు.
Worlds Oldest Man | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి (Worlds Oldest Man)గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా (Juan Vicente Perez Mora) తాజాగా మరణించారు. 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వెనెజులా (Venezuela)కు చెందిన జువాన్.. మే 27, 1909లో ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలో గల ఎల్కోబ్రే పట్టణంలో జన్మించాడు. జువాన్ తల్లిదండ్రులకు మొత్తం 10 మంది జన్మించగా.. ఈయన తొమ్మిదో సంతానం. కాగా, 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా జువాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు (Guinness World Records) ఎక్కారు. ఫిబ్రవరి 4, 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులు. ప్రపంచంలోనే చాలాఏళ్లు జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తిగా ఆయన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ గుర్తించింది. ఈ మేరకు సర్టిపికేట్ కూడా అందించింది.
అయితే, 114 సంవత్సరాల వయసులో మంగళవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్తను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇక జువాన్‌కు 11 మంది పిల్లలు ఉన్నారు. 2022 నాటికి అతడికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.
Also Read..
Massive Fire | వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Taiwan | తైవాన్ను వణికించిన శక్తిమంతమైన భూకంపం.. నలుగురు మృతి
Taylor Swift: బిలియనీర్ల జాబితాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

