Kharg Island : పశ్చిమాసియాలో తాత్కాలికంగా యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రం చేసింది. ఇంతకుముందు హెచ్చరించినట్టుగానే ఆ దేశ వ్యూహాత్మక ఇంధన కేంద్రమైన ఖర్గ్ ద్వీపం(Kharg Island)పై క్షిపణులతో విరుచుకుపడింది. హర్ముజ్ జలసంధి(Hormuz Strait)ని పూర్తిగా తెరిచి ఉంచేందుకు విధించిన 48 గంటల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు ఆక్సియోస్ సంస్థకు వెల్లడించగా.. ఇరాన్‌కు చెందిన పాక్షిక అధికారిక వార్తా సంస్థ మెహ్ర్ ధ్రువీకరించింది.
ఆరు వారాలకు పైగా కొనసాగుతన్న యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించేందుకు, 45 రోజులు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ తిరస్కరించడంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేస్తున్నారు. సంధికి ఇరాన్ అంగీకరించకుంటే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జ్‌లను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ గడవుకు కొన్ని గంటల ముందే ఖర్గ్ ద్వీపంపై దాడులకు ఆదేశాలిచ్చారు. అమెరికా సైన్యం అక్కడి 50 స్థావరాలపై క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. తమ ఆయువుపట్టైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులకు ప్రతిఫలం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
BREAKING:
Israel has started strikes on railway infrastructure and bridges across Iran.
Meanwhile, US forces are targeting defensive installations on Kharg Island.
Airstrikes are continuing across the country. pic.twitter.com/qzDut04XrH
— Current Report (@Currentreport1) April 7, 2026
‘మా ఓపిక నశించింది. అమెరికాకు సంబంధించిన ఇంధన కేంద్రాలు, ఆ పరిశ్రమల కూటములను బూడిద చేస్తా’మని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్పష్టం చేసింది. మార్చిలో సైతం ఖర్గ్ ద్వీపం లక్ష్యంగా దాడులకు పాల్పడిన అమెరికా అక్కడి సైనిక స్థావరాలు, నౌకాదళ కేంద్రం, క్షిపణుల బంకర్లను నాశనం చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటలకు) హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ దాడులను తీవ్రం చేయాలని భావిస్తుండగా.. టెహ్రాన్ సైతం ధీటుగా బదులివ్వాలనే సంకల్పంతో ఉంది.
‘Kharg Island is a high-value card. If you destroy what’s on the Island then the Iranian economy will shudder to a halt as it wont be able to export oil or very little of it.’
Sky’s Michael Clarke reacts to the reports that Kharg Island has been targeted with several strikes pic.twitter.com/OaBVBFXZ4y
— Sky News (@SkyNews) April 7, 2026
సం సంధి కుదిర్చేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్‌కు టెహ్రాన్ షాకిచ్చింది. తాత్కాలిక సంధికి, విరణమణకు టెహ్రాన్ సిద్ధంగా లేదని.. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికే తాము ప్రధాన్యమిస్తున్నామని అమెరికాకు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు భవిష్యత్తులో తమ దేశంపై దాడికి పాల్పడబోమనే హామీతో సహా పది షరతులకు అంగీకరిస్తేనే తాము యుద్ధ విరమణపై ఆలోచిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేసింది.