టీకాలు వేసుకునేందుకు భయపడుతున్న అమెరికా మహిళలు.. ఎందుకంటే ?

వాషింగ్టన్: అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందగించింది. ఎందుకంటే అక్కడ 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న ఆడవారిలో ఇంకా సగం మంది టీకా తీసుకోలేదు. టీకాలు తీసుకుంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుందుని వాళ్లు భయపడుతున్నారు. ఇటీవల అమెరికా, లాటిన్ దేశాల్లో సోషల్ మీడియాలో ఈ అంశంపై పుకార్లు షికారు చేశాయి. టీకాలు వేసుకుంటే సంతానప్రాప్తిని కోల్పోతారని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వ్యాప్తి అయ్యాయి. దీంతో అమెరికాలోని ఆడవాళ్లు టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. వంధ్యత్వ సమస్యలు వస్తాయని వాళ్లు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఆన్లైన్లో ప్రచారం అవుతున్న తప్పుడు కథనాలతో వ్యాక్సినేషన్ వేగం తగ్గింది. మహిళా పేషెంట్లను ఒప్పించేందుకు అక్కడి డాక్టర్లు తెగ ఇబ్బందులు కూడా పడుతున్నారు.
టీకాలతో ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని ఫేస్బుక్లో విపరీతంగా తప్పుడు సమాచారం షేర్ అవుతున్నది. వ్యాక్సిన్ తీసుకున్న 97 శాతం మంది స్త్రీలు సంతాన ప్రాప్తికి నోచుకోలేరన్న రీతిలో కొన్ని కథనాలు ఫేస్బుక్లో పోస్టు అయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న మగవారి వల్ల.. వ్యాక్సిన్ తీసుకోని ఆడవారిలో సంతానం కలుగుతుందని కూడా కొన్ని పోస్టుల్లో ప్రచారం సాగింది. ఇలాంటి ఫేక్ పోస్టులతో అమెరికన్లు సతమతం అవుతున్నారు. ఫలితంగా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించింది. ఇక హెర్డ్ ఇమ్యూనిటీ సాధిద్దామనుకున్న బైడెన్ ప్రభుత్వానికి ఇదొక సమస్యగా మారింది.
టీకా వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి.. మహిళలు టీకాలు తీసుకోవడం లేదని ఓ అమెరికా అధ్యయనం తేల్చింది. ఫెర్టిలిటీ వ్యవస్థపై వ్యాక్సిన్ నెగటివ్ ప్రభావం చూపిస్తుందని జనం భావిస్తున్నారని, వ్యాక్సిన్ తీసుకోని వారు ఇదే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కైసర్ ఫామిలీ ఫౌండేషన్ డైరక్టర్ అష్లే కిర్జింగర్ తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు 18 నుంచి 49 ఏళ్ల మధ్య వారిలో.. 50 శాతం మంది మహిళలు, 47 శాతం మంది మగవారు టీకాలు తీసుకోలేదు. అయితే ఫెర్టిలిటీ భయం వల్లే వీళ్లంతా వ్యాక్సిన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.
మాతృత్వం అనేది ఆడవారికి ఎంతో వ్యక్తిగతమైందని, భావోద్వేగమైన అంశమని, అందుకే కొందరు ఇలాంటి మెసేజ్లతో మహిళలను టార్గెట్ చేస్తున్నారని మసాచుసెట్స్ వర్సిటీ ప్రొఫెసర్ డేవన్ గ్రేసన్ తెలిపారు. బోస్టన్ వర్సిటీ గైనకాలజీ ప్రొఫెసర్ క్యాథరీన్ స్పందిస్తూ.. వ్యాక్సిన్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థను టార్గెట్ చేస్తాయంటే.. అది కొంత ఆడవారికి ఆందోళన కలిగించే అంశమే అని అన్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజీ, అమెరికన్ సోసైటీ ఫర్ రిప్రోడక్టివ్ మెడిసిన్, సొసైటీ ఫర్ మెటర్నల్-ఫీటల్ మెడిసిన్ మాత్రం ఆ వాదనలను ఖండించింది. వ్యాక్సిన్లు తీసుకుంటే వంధ్యత్వం వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని పేర్కొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

