Watch: జంక్షన్ వద్ద కార్లపై గన్ గురిపెట్టిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే?
US Woman Points Gun | వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ వద్ద ఒక మహిళ గన్‌తో హల్చల్ చేసింది. కొన్ని కార్లపైకి తుపాకీని గురిపెట్టింది (US Woman Points Gun At Cars). ఇది చూసి వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
వాషింగ్టన్: వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ వద్ద ఒక మహిళ గన్‌తో హల్చల్ చేసింది. కొన్ని కార్లపైకి తుపాకీని గురిపెట్టింది (US Woman Points Gun At Cars). ఇది చూసి వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గన్ గురిపెట్టిన మహిళ మీదకు పోలీస్ కారును దూకించారు. దీంతో ఆమె రోడ్డుపై పడింది. చేజారిన గన్ తీసుకునేలోపు పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని నసావు కౌంటీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బెల్మోర్, జెరూసలేం అవెన్యూ జంక్షన్ వద్ద ఒక మహిళ తన చేతిలోని గన్ గురిపెట్టి అక్కడి వారిని భయపెట్టింది. తుపాకీని గాల్లోకి కూడా పేల్చింది. దీంతో పలు వాహనాల్లో ఉన్న పిల్లలు, పెద్దలు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆ మహిళ గన్ను తన తలకు గురిపెట్టుకున్నది. ఇంతలో పోలీస్ కార్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ రోడ్డుపై పడింది. అనంతరం పైకి లేచేందుకు ఆమె ప్రయత్నించింది. అలాగే చేతి నుంచి జారి దూరంగా పడిన గన్ను తీసుకోబోయింది. ఇంతలో పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణనష్టం నివారించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

