US sanctions | రష్యా చమురుపై మళ్లీ ఆంక్షలు.. మినహాయింపులకు ముగింపు పలుకనున్న అమెరికా..!
US sanctions | రష్యా చమురు (Russian oil) పై అమెరికా (US) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని భావిస్తుంది. మినహాయింపులు ఎత్తివేస్తే మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
US sanctions : రష్యా చమురు (Russian oil) పై అమెరికా (US) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని భావిస్తుంది. మినహాయింపులు ఎత్తివేస్తే మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రష్యా చమురుపై ఆంక్షలను నిలిపివేస్తూ కొనుగోలు కోసం ఇచ్చిన మినహాయింపులను ముగించాలనుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి (US Foreign minister) మార్కో రూబియో (Marco Rubio) వెల్లడించారు.
సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను పొడిగించే ఉద్దేశం ఉందా అని ఒక సెనెట్ ప్రశ్నించారు. దీనికి రూబియో బదులిస్తూ.. చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘త్వరగా దీనిని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చాం’ అని పేర్కొన్నారు.
అయితే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల మేరకు ట్రెజరీశాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడిచమురు (Russian oil) పై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. ఆ తర్వాత దాన్నే రెండుసార్లు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 17తో ముగియనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

