జనవరి 20కి ముందే అమెరికా వచ్చేయండి
అమెరికాలోని పలు యూనివర్సిటీలకు ట్రంప్ భయం పట్టుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో అవి ముందుగానే అప్రమత్తమయ్యాయి. గతంలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల ప్రయాణాలపై ఆంక్షలు విధించిన క్రమంలో ముందే జాగ్రత్త పడుతున్నాయి.
- విదేశీ విద్యార్థులకు యూఎస్ వర్సిటీల విజ్ఞప్తి
- ట్రంప్ ఆంక్షలు విధిస్తారని భయం
న్యూయార్క్: అమెరికాలోని పలు యూనివర్సిటీలకు ట్రంప్ భయం పట్టుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో అవి ముందుగానే అప్రమత్తమయ్యాయి. గతంలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల ప్రయాణాలపై ఆంక్షలు విధించిన క్రమంలో ముందే జాగ్రత్త పడుతున్నాయి. విద్యార్థులు జనవరి 20కి ముందే అమెరికాకు వచ్చి విద్యాసంస్థల్లో చేరాలని భారత్ సహా పలు దేశాల్లోని విద్యార్థులకు ప్రయాణ సూచనలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా మాసాచుపెట్స్, అమ్హోర్ట్స్ సహా పలు ప్రముఖ వర్సిటీల విదేశీ విద్యార్థులు, సిబ్బందిని జనవరి 20లోగా తమ దేశానికి వచ్చేయాలని కోరాయి. యూనివర్సిటీలకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫెయిర్స్ కూడా ఇదే తరహా అడ్వయిజరీ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ మొదటి రోజే ఇమ్మిగ్రేషన్, ఆర్థిక పాలసీలను లక్ష్యంగా చేసుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

