US teen | పేరెంట్స్, తోబుట్టువులను హత్య చేసిన యువకుడు.. వారు నరమాంస భక్షకులని ఆరోపణ
US teen | ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు.
వాషింగ్టన్: ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్తోపాటు అక్క, తమ్ముడిపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు.
కాగా, సీజర్ సోదరి విధులకు రాకపోవడంతో సహ ఉద్యోగి ఒకరు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కుటుంబ సభ్యులను కాల్చి చంపిన సీజర్ ఆ వ్యక్తిపై కూడా గన్ను గురిపెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను హత్య చేసి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడబోయిన సీజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులు నరమాంస భక్షకులని అతడు ఆరోపించాడు. తనను కూడా తినేందుకు వారు ప్లాన్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు ఇంట్లోని పలు చోట్ల కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఆ యువకుడు వారి మృతదేహాలను బాత్రూమ్లోకి ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గ్రహించారు. ఆ ఇల్లంతా రక్తమయంగా ఉండటం చూసి షాక్ అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సీజర్ వినియోగించిన బుల్లెట్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను దారుణంగా చంపడంపై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

