Covid Effect| కోవిడ్ ఎఫెక్ట్.. డాక్టర్ మూర్తి.. 10 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు..!
Covid Effect| అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి కుటుంబ సభ్యులు 10 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పో...

వాషింగ్టన్: అమెరికన్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.. అగ్రరాజ్య వైద్య శాఖలో కీలక అధికారి.. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ముఖ్యమైన అధికారి.. కానీ ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆయననూ వదిలి పెట్టలేదు.
దీని బారిన పడి వివేక్మూర్తికి చెందిన పది మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రతి అమెరికన్ తమను తాము రక్షించుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి హితవు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌పై శషబిషలు అక్కర్లేదని, స్వేచ్ఛగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. హెల్త్ సమాచారం షేరింగ్ విషయంలో విశ్వసనీయ శాస్త్రీయ వనరులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అమెరికాలో 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.
కానీ లక్షల మంది అమెరికన్లకు రక్షణ లేదన్నారు. వ్యాక్సినేషన్ చేయించుకోని వారు భారీగా ఇన్ఫెక్షన్ పాలవుతున్నారని డాక్టర్ వివేక్ మూర్తి గురువారం మీడియాకు చెప్పారు.
ప్రతి కరోనా మరణం తనకు బాధకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సర్జన్ జనరల్‌గా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.
‘కోవిడ్ వల్ల నేను పది మంది కుటుంబ సభ్యులను కోల్పోయా. ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకునే అవకాశం పొందాలని కోరుకుంటా’ అని చెప్పారు.
ఇద్దరు పిల్లల తండ్రిగా తాను వారిని వైరస్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ చేయించడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అమెరికాలో పిల్లలకు వ్యాక్సినేషన్ అనుమతించలేదు.
ఇవి కూడా చదవండి:
కోర్టుకే కాదు, ఎక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
హిందూ మహా సముద్ర ప్రాంతానికి బ్రిటన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్
టూ వీలర్స్ కు అద్దాలు తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు
2023 చివరిలోగా అయోధ్య ఆలయంలో భక్తుల పూజలకు అనుమతి
సోనియా, రాహుల్‌తో సిద్ధూ భేటీ
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో డెల్టా వేరియంట్ వల్లే 80 శాతం మందికి ఇన్ఫెక్షన్
Ola electric scooter : ఓలా బైక్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు ఇవే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

