వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో డెల్టా వేరియంట్ వల్లే 80 శాతం మందికి ఇన్ఫెక్షన్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్షన్లపై ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకిన వాళ్లలో మరణాల రేటు చాలా తక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. 677 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 71 మంది కొవాగ్జిన్, 604 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఉన్నారు. ఇద్దరు చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ముగ్గురు వైరస్ వల్ల చనిపోయారు.
ఇవీ అధ్యయనంలోని అంశాలు
- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్ (బీ.1.617.2) వల్లే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
- 9.8 శాతం మంది మాత్రమే హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కేవలం 0.4 శాతం మంది చనిపోయారు.
- హాస్పిటల్లో చేరాల్సిన అవసరంతోపాటు మరణాల రేటును వ్యాక్సినేషన్ గణనీయంగా తగ్గించినట్లు అధ్యయనంలో గుర్తించారు.
- ఇండియాలోని 17 రాష్ట్రాల నుంచి 677 మంది పార్టిసిపెంట్లపై అధ్యయనం నిర్వహించారు.
- వీళ్లలో 71 శాతం అంటే 482 మందికి ఒకటి లేదా రెండు లక్షణాలు కనిపించగా.. 29 శాతం మందికి అసలు లక్షణాలే లేవు.
- 69 శాతం మందికి జ్వరం రాగా.. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారం 56 శాతం మందిలో కనిపించింది.
- డెల్టా వేరియంట్ తర్వాత కప్పా వేరియంట్ వల్ల ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

