ఆత్మీయుల అస్థికలతో వజ్రాలు.. అమెరికా కంపెనీ వినూత్న ఆలోచన

ఆస్టిన్: కరోనా మహ్మమారి అనేక మంది జీవితాల్లో చీకటి నింపింది. అంతుచిక్కని ఆ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. తమకు ఇష్టమైనవారిని కడచూపు చూసుకోలేకపోయారు. అమితంగా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం ఎవరికైనా తీరని వ్యధను మిగులుస్తుంది. అమెరికాలోని ఆస్టిన్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఓ వినూత్న ఐడియాను రచించింది. చనిపోయిన వారి చితాభస్మంతో ధగధగలాడే వజ్రాలను ఆ కంపెనీ తయారు చేస్తున్నది. ఎటెర్నవా అనే స్టార్టప్ కంపెనీ అస్థికలతో డైమండ్స్ రూపొందిస్తున్నది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ కంపెనీకి మంచి గుర్తింపు వచ్చింది.
కరోనా వేళ తమ ఆత్మీయుల మరణిస్తే, చాలా మంది వారి అస్థికలను కూడా సేకరించుకోలేకపోయారు. అలాంటి వారికి ఎటెర్నవా లాంటి కంపెనీలు వజ్రాల రింగులతో మధుర జ్ఞపకాలను అందిస్తున్నాయి. నాలుగేళ్ల ఈ స్టార్టప్ కంపెనీ .. చనిపోయినవారి భస్మాన్ని లేదా వెంట్రుకలు నుంచి భిన్న పద్ధతిలో డైమండ్స్ రూపొందిస్తున్నది. డైమండ్కు ఎక్కువ కాలం మెరిసే లక్షణాలు ఉన్న నేపథ్యంలో.. వాటిని రూపొందించిడంపైనే ఆ కంపెనీ దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లలో వెయ్యి మంది కస్టమర్లకు 1500 డైమండ్లను తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీ 10 మిలియన్ల డాలర్ల సంస్థగా ఎదిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ashes
- diamonds
- Eterneva
- US startup
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

