Russian Oil | రష్యా చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఆ దేశాలే కొనుగోలు చేయాలంటూ మెలిక
రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.
Russian Oil : ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చమురు వినియోగంపై అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచానికి కొంత ఊరట కలిగేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.
ఇరాన్ వార్ సందర్భంగా ఇటీవల రష్యా చమురు కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ గడువు ముగియడంతో మళ్లీ రష్యా చమురుపై మళ్లీ నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కానీ, ఇక్కడే ఒక మెలిక పెట్టింది. చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు, పేద దేశాలు, అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటున్న దేశాలు మాత్రమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని సూచించింది. అలాగే, రష్యాతో చమురు కొనుగోలుకు కొత్తగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. కొత్తగా దిగుమతి చేసుకోకూడదు. ఈ నిర్ణయం ఇప్పటికే రష్యా నుంచి బయల్దేరిన చమురు నౌకలకు మాత్రమే వర్తిస్తుందని అమెరికా తెలిపింది.
అంటే ఇప్పటికే లోడ్ అయ్యి, మార్గమధ్యలో ఉన్న చమురును మాత్రమే కొనొచ్చని తెలిపింది. అమెరికా నిర్ణయం ఇండియాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇండియా ప్రస్తుతం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. దేశీయ అవసరాలకు అనుగుణం, ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేలా చమురు కొంటున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
ఎక్కువ క్రూడాయిల్‌ను ఇండియా.. ప్రస్తుతం రష్యా నుంచే కొంటోంది. హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా దాదాపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రెండున్నర నెలల క్రితం బయల్దేరిన చమురు నౌకలే పూర్తిగా ఇండియాకు చేరుకోలేదు. హార్ముజ్ నుంచి నౌకల రవాణా కష్టంగా మారింది. దీంతో చమురుకు ఇండియా ఇబ్బంది పడుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Energy Crisis
- India
- Russian Oil
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

