అబుదాబి: అమెరికా, రష్యా దేశాలు ఖైదీలను మార్చుకున్నాయి. అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రినర్ను రష్యా అప్పగించింది. ఇక రష్యా ఆయుధ డీలర్ విక్టర్ బౌట్ను అమెరికా అప్పగించింది. అబుదాబి విమానాశ్రయంలో ఈ కార్యక్రమం జరిగింది. యూఏఈ నుంచి సురక్షితంగా బాస్కెట్బాల్ ప్లేయర్ గ్రినర్ అమెరికా వస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఆయుధ వ్యాపారం కేసులో విక్టర్ గత 12 ఏళ్ల నుంచి అమెరికా జైలులో ఉన్నారు. అమెరికా అప్పగించిన తర్వాత విక్టర్ .. మాస్కో చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో మాస్కో విమానాశ్రయంలో గ్రినర్ను అరెస్టు చేశారు. కన్నాబిస్ కలిగి ఉన్న కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బైడెన్ సర్కార్ జూలైలో ఖైదీ అప్పగింతకు ప్రతిపాదన చేసింది.
Обнародованы видеокадры обмена россиянина Виктора Бута на американку Бриттни Грайнер:https://t.co/hs1cFtHbOs
Видео: ТАСС pic.twitter.com/UZ209BYPRX
— ТАСС (@tass_agency) December 8, 2022