US Man | మహిళను హత్య చేసి గుండెను కోసి వండిన వ్యక్తి.. ఆపై ఇద్దరు కుటుంబ సభ్యులను హత్య
US Man | ఒక వ్యక్తి (US Man) మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె గుండెను కోసి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బంగాళదుంపతో కలిపి ఆ గుండెతో కూర వండాడు. కుటుంబ సభ్యులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపాడు.
వాషింగ్టన్: ఒక వ్యక్తి (US Man) దారుణాలకు పాల్పడ్డాడు. ఒక మహిళను హత్య చేసి ఆమె గుండెను కోశాడు. దానిని ఇంటికి తీసుకెళ్లి కూర వండాడు. కుటుంబ సభ్యులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపాడు. అమెరికాలోని ఓక్లహోమాలో ఈ దారుణ సంఘటన జరిగింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్‌కు డ్రగ్స్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష కింద 2021లో పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు.
కాగా, జైలు నుంచి విడుదలైన నెల లోపే లారెన్స్ పాల్ ఆండర్సన్ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. 2021 ఫిబ్రవరిలో 41 ఏళ్ల ఆండ్రియా లిన్ బ్లాంకెన్‌షిప్ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. ఆ మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె గుండెను కోసి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బంగాళదుంపతో కలిపి ఆ గుండెతో కూర వండాడు. 67 ఏళ్ల అంకుల్ లియోన్ పై, 66 ఏళ్ల ఆంటీ డెల్సీ పైకు వడ్డించేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఆండర్సన్ మరో దారుణానికి పాల్పడ్డాడు. వారిద్దరితోపాటు నాలుగేళ్ల వారి మనుమరాలిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అంకుల్ లియోన్, చిన్నారి కేయోస్ యేట్స్ మరణించారు.
మరోవైపు మూడు దారుణ హత్యలు, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడిన లారెన్స్ పాల్ ఆండర్సన్‌ను దోషిగా గ్రేడీ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు బుధవారం నిర్ధారించింది. అయితే అతడికి మరణ శిక్ష విధించ వద్దని బాధిత కుటుంబ సభ్యులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆండర్సన్‌కు పెరోల్‌కు అవకాశం లేని జీవితకాల జైలు శిక్షను కోర్టు విధించింది.
కాగా, ఒక మహిళతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా ఆండర్సన్ హత్య చేయడం, మరొకరిపై హత్యాయత్నం చేయడాన్ని బాధిత కుటుంబం తట్టుకోలేకపోయింది. డ్రగ్స్ కేసులో శిక్ష పూర్తికాక ముందే నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్ష కింద పెరోల్‌పై అతడ్ని విడుదల చేయడాన్ని వారు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్, పెరోల్‌పై విడుదల కోసం గవర్నర్‌కు సిఫార్సు చేసిన జైలు బోర్డు అధికారులపై కోర్టులో దావా వేశారు.
అయితే 2019 ఆగస్ట్‌లో గవర్నర్ క్షమాభిక్ష కింద పెరోల్‌పై విడుదల చేసే ఖైదీల జాబితాలో ఆండర్సన్ పేరు పొరపాటున వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఏడాది జూలైలో తొలిసారి అతడు చేసిన దరఖాస్తును పెరోల్ బోర్డు తిరస్కరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు తిరస్కరణ తర్వాత మూడేళ్లకు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉందన్నారు.
Also Read:
Ukraine soldiers: లక్షకు పైగా ఉక్రెయిన్ సైనికులు మృతి: అమెరికా
Xi Jinping: మాస్కోలో పుతిన్‌తో భేటీకానున్న జీ జిన్‌పింగ్..
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- cuts
- Kills
- US man
- Woman's Heart
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

