Xi Jinping: మాస్కోలో పుతిన్‌తో భేటీకానున్న జీ జిన్‌పింగ్..
Xi Jinping: జీ జిన్‌పింగ్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నారు. మాస్కోలో ఆయన పుతిన్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ భేటీ కీలకంకానున్నది.
మాస్కో: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Xi Jinping).. వచ్చే వారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)తో భేటీకానున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఆ భేటీలో సమగ్రమైన భాగస్వామ్య, వ్యూహాత్మక సహకారం గురించి చర్చించనున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. కానీ పశ్చాత్య దేశాలు మాత్రం చైనాపై ఆగ్రహంగా ఉన్నాయి. డ్రాగన్ దేశం రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి.
పుతిన్ అందించిన ఆహ్వానం మేరకు.. మార్చి 20 నుంచి 22 వరకు జీ జిన్‌పింగ్ మాస్కోలో పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ(China Foreign Ministry) అధికారులు తెలిపారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక డాక్యుమెంట్లపై సంతకాలు చేయనున్నారు. ఫ్రెండ్షిప్, పీస్ ఉద్దేశంతో ఆ ట్రిప్ సాగనున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్నది. జీ జిన్‌పింగ్‌ను తాను కూడా కలవాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

