Monkeypox And Coronavirus | అరుదైన సంఘటన.. ఒకే వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా వైరస్..!!
మూడేళ్లు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అక్కడక్కడా కొవిడ్-19 కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మారడం లేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంకీపాక్స్ విస్తరించింది. ఇండియాలోనూ మూడు కేసులు వెలుగుచూశాయి. కాగా, అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకాయి.

మిట్చో థాంప్సన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో అతడి శరీరంపై ఎర్రని దద్దుర్లు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ అని తేలింది. అతడికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెండు వైరస్ల వల్ల అతడు వారాలపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఇది అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర కమిటీ గురువారం సమావేశమై మంకీపాక్స్‌ను ప్రపంచ సంక్షోభంగా ప్రకటించాలా? వద్దా? అనే విషయాన్ని వారాల వ్యవధిలో రెండోసారి పరిశీలించిన మరుసటి రోజే ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, మంకీపాక్స్ వైరస్ కనీసం 95 శాతం కేసుల్లో లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపించిందని తాజా పరిశోధనలో తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి