Dream | అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి.. ఇంతకీ ఏమైందంటే..
Dream | కొన్నిసార్లు వచ్చే కలలు చాలా విడ్డూరంగా ఉంటాయి. కొండ మీద నుంచి పడిపోతున్నట్లు కల వస్తుంది. దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. కలలో ఎవరో మనకు ఫోన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
Dream | కొన్నిసార్లు వచ్చే కలలు చాలా విడ్డూరంగా ఉంటాయి. కొండ మీద నుంచి పడిపోతున్నట్లు కల వస్తుంది. దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. కలలో ఎవరో మనకు ఫోన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిద్ర లేచి చూసేసరికి నిజంగానే ఫోన్ మోగుతుంటుంది. ఇలాంటి వింత అనుభవాలు మనలో చాలామందికే ఎదురై ఉంటాయి. ఇలాంటి విచిత్రమైన కలనే ఓ వ్యక్తికి వచ్చింది. తన ఇంట్లోకి చొరబడ్డ ఓ దొంగను కాలుస్తున్నట్లు కల కని.. నిజంగానే తుపాకీతో తననే కాల్చేసుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్లో ఏప్రిల్ 10వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికా ఇల్లినాయిస్లోని లేక్ బారింగ్టన్లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్ర పోతున్న సమయంలో ఒక కల వచ్చింది. ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో ఆందోళనకు గురైన డికారా ఆ నిద్ర మబ్బులోనే తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో కలలో వచ్చిన దొంగపై కాల్పులు జరిపాడు. కానీ బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది. అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. ఇంకేముందు దెబ్బకు నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ తగిలిన దెబ్బకు విలవిల్లాడిపోయాడు. గాయం గట్టి కావడంతో తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. ఈలోగా రివాల్వర్ పేలిన శబ్దం విన్న పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందని మార్క్ డికారాను విచారించారు. అప్పుడు మార్క్ డికారా చెప్పింది విని ఒకింత షాక్‌కు గురయ్యారు.
డికారా చెప్పింది నిజమేనా? లేదా నిజంగానే దొంగతనం జరిగిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడంతో.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. అలాగే డికారాకు తుపాకీ కలిగి ఉండేందుకు కావాల్సిన లైసెన్స్ లేదని కూడా విచారణలో తెలుసుకున్నారు. ఇల్లినాయిస్లో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ కార్డు రద్దయ్యింది. అయినప్పటికీ డికారా రివాల్వర్‌ను వాడుతున్నాడు. దీంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటంతోపాటు, నిర్లక్ష్యంగా తుపాకీని వాడిన నేరాల కింద అతనిపై కేసులు నమోదు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

