వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. సీజన్ మారడంతో ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరుగుతున్నది. గత రెండు వారాలుగా 12 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బాగా నమోదవుతున్నాయి. అరిజోనా, న్యూ మెక్సికో, గ్రేట్ ప్లెయిన్స్, మిన్నెసోటా వంటి ప్రముఖ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొలరాడో బాగా ప్రభావితమైంది. అధిక టీకా రేటు ఉన్న ప్రాంతాల్లోనూ కరోనా వ్యాపిస్తున్నది. దీంతో హాస్పిటల్స్‌లోని ఐసీయూ బెడ్స్ నిండుతున్నాయి.
కాగా, కరోనా సెకండ్ వేవ్ నుంచి వైద్యులు, నర్సులు ఊపిరి తీసుకోకముందే మళ్లీ వైరస్ సోకిన రోగులు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. దీంతో వారిపై మరోసారి ఒత్తిడి పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ ఇప్పటికీ అక్కడ వ్యాపిస్తూనే ఉన్నది. దేశం వింటర్ వైరస్ సీజన్లోకి వెళ్లడంతో ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మళ్లీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.