America | అమెరికాలో తెలుగోళ్ల హవా.. ఏ రాష్ట్రం చూసినా మనోళ్లే
ఏ దేశం వెళ్లినా భారతీయులుంటారు. అందులోనూ తెలుగువాళ్లు కచ్చితంగా ఉంటారు. అయితే, అమెరికాలో మాత్రం మనోళ్లంతా పాతుకుపోతున్నారట.
- గత ఎనిమిదేండ్లలో 4 రెట్లు పెరిగిన తెలుగువాళ్లు
- అమెరికా సెన్సస్ బ్యూరో రిపోర్ట్
America | న్యూయార్క్, జూన్ 27: ఏ దేశం వెళ్లినా భారతీయులుంటారు. అందులోనూ తెలుగువాళ్లు కచ్చితంగా ఉంటారు. అయితే, అమెరికాలో మాత్రం మనోళ్లంతా పాతుకుపోతున్నారట. గత ఎనిమిదేండ్లలో తెలుగువాళ్ల జనాభా నాలుగు రెట్లు పెరిగిందట. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగువాళ్ల జనాభా ఉండగా, 2024నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకున్నది. కాలిఫోర్నియాలో 2 లక్షలు, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్లో 83 వేలు, వర్జీనియాలో 78 వేలు, జార్జియాలో 52 వేల మంది తెలుగువాళ్లు ఉన్నారు.
ఇందులో దాదాపు 10 వేల మంది హెచ్1బీ వీసా పొందారు. ఇక, ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు యూఎస్ వెళ్తున్నారు. వీరిలో 80 శాతం మంది తమ వద్ద రిజిష్టర్ చేయించుకున్నవారేనని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ కార్యదర్శి అశోక్ కొల్లా తెలిపారు. అక్కడికి వెళ్లిన వారిలో 75 శాతం మంది స్థిరపడ్డారు. ఎక్కువగా డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లేలో స్థిరపడ్డారు. అమెరికాలోని 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉన్నది. హిందీ, గుజరాతీ భాషల కంటే తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

