US Attacks | యెమెన్‌పై అమెరికా బాంబుల వర్షం.. 50 లక్ష్యాలు ధ్వంసం.. 80 మంది మృతి
US Attacks | యెమెన్ (Yemen) పై అమెరికా (USA) బాంబుల వర్షం కురిపించింది. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్‌లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి.
US Attacks : యెమెన్ (Yemen) పై అమెరికా (USA) బాంబుల వర్షం కురిపించింది. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్‌లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా (Sana), హోదైద (Hodeidah), అమ్రాన్ నగరాలపై బాంబులు జార విడిచినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
తాజా దాడుల్లో హోదైదలోని పోర్టు, విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. తమ దాడులు ఏమాత్రం ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది.
ఈ దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. ఈ చర్యలు తీవ్ర ఆందోళనకరమన్నారు. కాగా హూతీ రెబల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

