ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంక్‌లను పంపనున్న అమెరికా, జర్మనీ
US-Germany war tanks: యుద్ధ ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా, జర్మనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ట్యాంక్‌లు ఉక్రెయిన్‌కు చేరితే అప్పుడు రష్యాపై ఆ దేశం వత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి.
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా గత ఫిబ్రవరి నుంచి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యాను ఎదుర్కొనేందుకు తమకు యుద్ధ ట్యాంక్‌లు కావాలని కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి యుద్ధ ట్యాంక్‌లను పంపేందుకు అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు అగ్రదేశాలు యుద్ధ ట్యాంక్‌లను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్ వార్ కొత్త రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై త్వరలో ఓ ప్రణాళికను వెల్లడించనున్నారు. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కనీసం 14 లియోపార్డ్ 2 ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపించాలని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ భావిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాలో ఉన్న రష్యా అంబాసిడర్ దీన్ని తప్పుపట్టారు. ఇది మళ్లీ రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. యుద్ధ ట్యాంక్‌లు వస్తే రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ ప్రదేశాలను మళ్లీ చేజిక్కించుకోవచ్చు అని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

