Taliban: ఉగ్రదాడుల ప్రకటన నుంచి తాలిబన్ల పేరు తీసేసిన భద్రతా మండలి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చిన ప్రకటనలో తాలిబన్( Taliban ) పేరును తీసేసింది. ఆగస్ట్ నెలలో భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్.. ఈ ప్రకటనపై సంతకం చేసి జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చిన ప్రకటనలో తాలిబన్( Taliban ) పేరును తీసేసింది. ఆగస్ట్ నెలలో భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్.. ఈ ప్రకటనపై సంతకం చేసి జారీ చేసింది. గతంలో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన మరుసటి రోజు అంటే ఈ నెల 16న ఆఫ్ఘన్ పరిస్థితులపై సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దేశ భూభాగంలో నుంచి అయినా ఆపరేట్ చేసే ఏ ఉగ్రవాద సంస్థకూ తాలిబన్ లేదా ఏ ఇతర ఆఫ్ఘన్ గ్రూప్ మద్దతివ్వకూడదని ఆ ప్రకటనలో భద్రతా మండలి హెచ్చరించింది. తాజాగా ఈ ప్రకటనలో నుంచి తాలిబన్ పేరును ఎత్తేయడం గమనార్హం.
ఐక్యరాజ్య సమితికి ఇండియా నుంచి శాశ్వత ప్రతినిధిగా ఉన్న సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనలో మార్పు గురించి వెల్లడించారు. ప్రకటనలో నుంచి T పదం వెళ్లిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. దౌత్యంలో 15 రోజుల సమయం అంటే చాలా ఎక్కువ. తాజా ప్రకటనలో T పదం లేదు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆగస్ట్ 16, ఆగస్ట్ 27న జారీ చేసిన ప్రకటనలు చూడండి అని అక్బరుద్దీన్ ఆ ట్వీట్లో చెప్పారు.
In diplomacy…
— Syed Akbaruddin (@AkbaruddinIndia) August 28, 2021
A fortnight is a long time…
The ‘T’ word is gone…🤔
Compare the marked portions of @UN Security Council statements issued on 16 August & on 27 August… pic.twitter.com/BPZTk23oqX
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

