న్యూయార్క్: ప్రొటీన్ బార్స్, కూల్‌డ్రింక్స్, రెడీ మీల్స్, ఫాస్ట్‌ఫుడ్ లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది. స్టార్క్ న్యూ సంస్థ పరిశోధకులు 10 వేల మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటున్న వారు తీసుకోని వారితో పోల్చితే 39 శాతం ఎక్కువగా హైబీపీ బారినపడుతున్నట్టు తేలింది. హైబీపీ కాస్తా గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్లకు కారణమవుతున్నట్టు తేల్చారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటున్నవారు 24 శాతం ఎక్కువగా గుండె పోటు, స్ట్రోక్‌లాంటి వ్యాధుల బారినపడుతున్నట్టు గోల్డ్ స్టాండర్డ్ మెటా తెలిపింది.