ఒకే పదం ట్వీట్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు… ఏం ట్వీట్ చేశారంటే?
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విట్టర్ వన్ వర్డ్ ట్రెండ్‌లో పాల్గొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఏక పదం ట్వీట్ వైరల్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో వన్ వర్డ్ ట్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి డొమినోస్, స్టార్‌బక్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లు కూడా ఏక పదం ట్వీట్లతో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వీరి సరసన చేరారు. ఆ దేశంపై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఫ్రీడమ్’ అనే ఒకే పదాన్ని శుక్రవారం ట్వీట్ చేశారు. రష్యా దాడిలో ఆ దేశం అతలాకుతలమైన నేపథ్యంలో తమకు ‘స్వేచ్ఛ’ కావాలని ఈ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చేసిన ఒకే పదం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా స్పందించి పలు ట్వీట్లు చేశారు. ‘ఉక్రేనియన్లు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రజలు. ఒకరి (రష్యా) మోకాళ్లపై బతకడం కంటే తమ కాళ్ల మీదపడి చనిపోవడం మేలు అనడానికి వీరే నిదర్శనం. నిజంగా ఉక్రెయిన్, ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కావాలి. స్లావా ఉక్రాయినీ’ అని ఒక వృద్ధురాలు చేసిన రీ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది.
Freedom
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 2, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

