అత్యాధునిక రైఫిల్‌తో ఉక్రెయిన్ మహిళా ఎంపీ.. రష్యాను ప్రతిఘటిస్తామంటూ ప్రకటన
ఉక్రెయిన్‌పై రష్యా తన భీకర దాడులను కొనసాగిస్తూనే వుంది. పలు కీలకమైన పట్టణాల్లో రష్యా జెండాను కూడా పాతేసింది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కిన్ వంటి కీలక నగరాల్లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. తాము చివరాఖరు ఊపిరి వరకూ పోరాడుతూనే వుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఈ సమయంలో ఉక్రెయిన్‌కు చెందిన కిరా రుడిక్ అనే ఎంపీ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ప్రతి పౌరుడూ… ఆడ, మగ అందరూ రష్యా చేస్తున్న దమనకాండను నిరసిస్తూ ఆయుధాలు పట్టుకోడానికి సిద్దంగా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. ఆ ఎంపీ కలాష్నికోవ్ రైఫిల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం ప్రారంభించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ… దేశ రక్షణ కోసం తాము ఎవ్వరికైనా ఆయుధాలను ఇవ్వడానికి రెడీగానే ఉన్నామని కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రష్యా మెరుపుదాడి చేసిందని, నాజీ జర్మనీ లాగా రష్యా దాడి చేసిందని జెలెన్స్కీ అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

